Rail tracks broke in Bapatla: ఒరిస్సా రైలు ప్రమాద ఘటన తరువాత జనాలలో రైలు ప్రయాణాలంటే భయపడుతున్నారనడానికి ఎలాంటి సందేహం లేదు.. ఎప్పుడు ఎం జరుగుతుందోనని భయంతో ప్రయాణాలు చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ సమీపంలో ఒంగోలు వైపు వెళ్లే అప్ లైన్ రైలు పట్టా విరిగి ఉంది ఆ విషయాన్ని గ్యాంగ్ మెన్ గమనించి అధికారులకు తెలియజేసి ప్రమాదం జరగకుండా ఆపాడు.. లేకుంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని అధికారులు తెలిపారు.
ALSO READ: ఒడిశా రైలు ప్రమాద మృతులకు నివాళులు.. పదో రోజు గుండు గీయించుకున్న గ్రామస్థులు!
ఆ సమయంలో అదే లైన్‌పై వస్తున్న బెంగుళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ వస్తున్నట్లు గ్రహించి ఆ రైలుకు ఎదురుగా సుమారు అర కిలోమీటర్ మేర పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్లకు అర్థమయ్యే రీతిలో రైలు పట్టా విరిగినదని సైగలు చేస్తూ వారికి సమాచారం అందించాడు. అది గమనించిన సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్లు వెంటనే రైలును నిలుపుదల చేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది.. స్పందించిన రైల్వే అధికారులు వెంటనే ట్రాక్ వద్దకు వెళ్లు చూడగా ఒంగోలు వైపు వెళ్లే ట్రాక్ విరిగి ఉండటాన్ని గమనించారు. తక్షణమే వారు మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు.. అయితే రెండు పట్టాల మధ్య ఉండే వెల్డింగ్ ఊడటం వల్ల రెండు పట్టాల మధ్య గ్యాప్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు.. గ్యాంగ్ మాన్ గమనించకుండా ఉన్నట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం యాధావిధిగా రైలు నడుస్తున్నాయి.
ALSO READ: ఒడిశాలో రైలుకు మంటలు.. బ్రేకులు సరిగా పడక..
సమాచారం అందించిన వ్యక్తికి ఎస్పీ వకుల్ జిందాల్ సన్మానం.. రైలు పట్టా విరిగి ఉండటాన్ని గమనించి సమయస్ఫూర్తితో ప్రమాదం జరగకుండా చేసిన వ్యక్తిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సన్మానించారు. విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గద్దె హేమ సుందర్ బాబును శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేసారు. జరిగిన ఘటన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గద్దె హేమ సుందర్ బాబు సమయస్ఫూర్తిగా వ్యవహరించి తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి లోకో పైలట్లకు సైగల ద్వారా రైలు పట్టా విరిగినదని సమాచారం అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడటం అభినందనీయమన్నారు.
ALSO READ: ఒడిశా రైలు ప్రమాదం.. మృతదేహాలను పెట్టిన పాఠశాల కూల్చివేత.. అందుకేనా?
ఇటీవల.. తాడి- అనకాపల్లి మధ్య బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్.. తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా విశాఖ- విజయవాడ ప్రధాన మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా ప్రయాణించాయి. జన్మభూమి, సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కాగా, విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా వెల్లడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.