Gottipati Ravi Kumar Fire on CM Jagan : ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం గుదిబండలా మారిందని అద్దంకి ఎమ్మెల్యే, టీడీపీ నేత గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బూబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో ఎమ్మెల్యే ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు వివరించారు.
TDP Leader Gottipati Ravi Kumar Participated in Babu Surety Bhavishyathuku Guarantee : గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. వెంపరాల, ఉప్పలపాడు, వెలమవారిపాలెం గ్రామాల సమీపంలో గుండ్లకమ్మ నదిపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి, అనేక ఎకరాలను సాగులోకి తీసుకోచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆగి పోయిన అభివృద్ధి పనులన్నింటిని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
బాబు ష్యూరిటీ కార్యక్రమంలో అరుదైన ఘటన, బిడ్డ భవిష్యత్తు కోసం 'బ్రాహ్మణి'గా నామకరణం
అన్నదాతల ఆత్మహత్యలు : జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చెప్పిన మాటలను అధికారంలోకి తర్వాత బాదుడే బాదుడు అంటూ అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం మోపారని, ఈ సంగతిని ప్రజలందరూ గుర్తుంచుకున్నారని గొట్టిపాటి అన్నారు. రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం సృష్టించారని ఆయన ఆరోపించారు. యువతకు ఉద్యోగావకాశాలు లేక మరో 20 ఏళ్లు వెనక్కు పోవాల్సి వచ్చిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడువేల మంది పైచిలుకు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడారని గుర్తు చేశారు. అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కుతో వైసీపీకు బుద్ధి చెప్పాలని కోరారు.
యువత భవితకు నాంది పలకాలి : రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అప్పులు పెరిగాయని, ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని తెలిపారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి సైకో పాలన పోయి ప్రజాపరిపాలన రావాలంటే అందరూ కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేయాలని, తెలుగుదేశం పార్టీ గెలుపే రాష్ట్ర ప్రజలకు, యువత భవితకు నాంది పలకాలని పిలుపును ఇచ్చారు.
సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ : రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదని ఎక్కడ తట్టెడు మట్టివేసిన పాపాన పోలేదని కనీసం గుంతలు పూడ్చే పరిస్థితి కూడా లేదని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రాంతాలు, కులాల వారీగా చిచ్చు పెట్టడం ఈ ముఖ్యమంత్రికే సాధ్యమని విమర్శించారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటినుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు.
సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం : వైసీపీ వైఫల్యాలను టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి చేరవేసి నవ్యాంధ్రప్రదేశ్ పునర్నించుకోవడం కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తదనుగుణంగా కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని గొట్టిపాటి రవికుమార్ పిలుపును ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.