ETV Bharat / state

Four Police Officers Suspended: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు.. సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు - ఓటరు జాబితా సవరణలో జోక్యం

Four Police Officers Suspended: పర్చూరు నియోజకవర్గంలోని ఓట్ల అక్రమాలకు పాల్పడిన పోలీసులపై.. ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపించేశారు. వైసీపీ నేతలతో చేతులు కలిపి.. ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగించిన ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలపై సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు. ఇంతటి అక్రమాలకు పాల్పడిన వారిని.. ఉద్యోగం నుంచి తొలగించకుండా సస్పెన్షన్‌తో సరిపెట్టేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Four_Police_Officers_Suspended
Four_Police_Officers_Suspended
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 8:29 AM IST

Four Police Officers Suspended: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు.. సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు

Four Police Officers Suspended: అధికార వైసీపీ నేతలతో కుమ్మక్కై.. తటస్థులు, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపు కుట్రలో భాగస్వాములైన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని పోలీసులపై.. ఆ శాఖ ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెట్టేశారు. ఎన్నికల సంఘం నిబంధనల్ని ధిక్కరించి మరీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(Voters List Amendment Process)లోకి అక్రమంగా చొరబడి తీవ్ర నేరానికి పాల్పడ్డ పోలీసులను సర్వీసు నుంచే తొలగించాల్సి ఉండగా సస్పెండ్‌(Four Police Officers Suspended) చేసి మమ అనిపించేశారు.

సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు: మార్టూరు సీఐ టి.ఫిరోజ్, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ఎస్సైలు ఎన్‌సీ ప్రసాద్, కె.కమలాకర్, కె.అనూక్‌లను తొలుత వేకెన్సీ రిజర్వు(Four Police Officers to VR)లోకి పంపిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్‌ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకల(Irregularities and manipulations in Voter List)కు తెరలేపిన వైసీపీ నేతల(YCP Leaders)కు సహకరిస్తూ.. బీఎల్వోలపై ఒత్తిడి తీసుకొచ్చిన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసి సరిపెట్టేయటం ఏంటనే ప్రశ్నలు తలెతత్తుతున్నాయి.

Four Police Officers to VR: ఓటరు జాబితా సవరణలో జోక్యం.. నలుగురు పోలీసు అధికారులపై చర్యలు

వెల్లువెత్తుతున్న విమర్శలు: మిగతాచోట్ల ఈ తరహా ఘటనలకు ఎవరూ పాల్పడకుండా హెచ్చరించేలా కఠిన చర్యలు తీసుకోకుండా మమ అనిపించేయటమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సహకరించినందుకు వీరిపైన చర్యలు తీసుకుంటున్నట్లు కాకుండా పరిపాలన కారణాల రీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వారి సర్వీసు రికార్డులోకి ఈ అక్రమాల వివరాలు ఎక్కకుండా కాపాడేందుకేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

పర్చూరు నియోజకవర్గంలో బీఎల్వో(BLO)లుగా పనిచేస్తున్న మహిళా పోలీసు(Women Police)లపై మార్టూరు సీఐ టి.ఫిరోజ్, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ఎస్సైలు ఎన్‌సీ ప్రసాద్, కె.కమలాకర్, కె.అనూక్‌లు ఒత్తిడి తీసుకొచ్చి.. ఓట్ల తొలగింపు(Votes Deletion) కోసం అందిన ఫారం-7 దరఖాస్తు(Form-7 Application)ల సమాచారాన్ని వారి నుంచి ఎప్పటికప్పుడు సేకరించారు. ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపు(Whatsapp Group) ఏర్పాటు చేసి, ఫారం-7 దరఖాస్తుల వ్యవహారంపై ఆ గ్రూపులో బీఎల్వోలతో నిరంతరం చాటింగ్‌ చేస్తూ.. మాట్లాడుతూ ఉండేవారు.

Cases Filed on False Form 7 Applicants అధికార పార్టీ నయా ఆయుధం ఫారం-7! కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు

హైకోర్టుకు వెళ్లడంతో.. ఈ సమాచారాన్ని ప్రతిరోజూ అధికార పార్టీ నేతలకు చేరవేశారని.. పేర్కొంటూ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(Parchur TDP MLA Eluri Sambasiva Rao) ఎన్నికల సంఘానికి(Election Commission) పదే పదే ఫిర్యాదులు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవటంతో ఆయన ఇటీవల హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆఘమేఘాలపై కదిలిన పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులను సస్పెండ్‌(Police Higher Officials Suspended Four Officers) చేశారు. ఇవి పోలీసులపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు చెప్పడానికి చేపట్టిన మొక్కుబడి చర్యలే తప్ప.. ఎలాంటి ఫలితమూ లేదని విపక్షాలు(Oppositions) మండిపడుతున్నాయి.

Voters List Without Correction of Irregularities In AP: అవకతవకలు సరిదిద్దకుండానే ఓటర్ల ముసాయిదా జాబితా.. విడుదలకు ఈసీ యత్నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.