ETV Bharat / state

జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్​ ట్రయల్​ రన్​ సక్సెస్​

EMERGENCY LANDING TRAIL RUN SUCCESS : బాపట్ల జిల్లా కొరిశపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రన్‌వేపై.. విమానాల అత్యవసర ల్యాండింగ్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన నాలుగు విమానాలు రన్‌వే మీదుగా ప్రయాణించి.. కాస్త ఎత్తు నుంచే టేకాఫ్‌ అయ్యాయి. రన్‌వే విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు పూర్తి అనువుగా ఉందని.. వాయుసేన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

EMERGENCY LANDING TRAIL RUN SUCCESS
EMERGENCY LANDING TRAIL RUN SUCCESS
author img

By

Published : Dec 29, 2022, 2:52 PM IST

విమానాల అత్యవసర ల్యాండింగ్​ ట్రయల్​ రన్​ సక్సెస్​

EMERGENCY LANDING TRAIL RUN SUCCESS : బాపట్ల జిల్లా పరిధిలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పరిసరాలు.. కొన్ని గంటలపాటు రన్​వేను తలపించాయి. కొరిశపాడు వంతెన నుంచి జె.పంగులూరు మండలం రేణింగవరం వంతెన వరకు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన రన్‌వేపై నిర్వహించిన టెస్ట్‌ విజయవంతమైంది. హైవే రన్‌వేపై విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో పరీక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక రాడార్‌ సాంకేతికతంగా సహకరిస్తుందో లేదో పరిశీలించారు. విమానాలు భూమిపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. పూర్తిగా ల్యాండ్ అవకుండా కొన్ని మీటర్ల ఎత్తు నుంచే మళ్లీ పైకి వెళ్లాయి.

"అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండింగ్​ చేయడం, ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బందిని తరలించడానికి ఈ రన్​వే అనుకూలంగా ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయనవసరం లేదు. మొత్తం 4 ప్లేన్​లు వచ్చాయి. ట్రాన్స్​పోర్టు ప్లేన్​ AM 32 , ఫైటర్​ ప్లేన్ సూపర్​ 30, తేజస్​ 2 ప్లేన్లు ల్యాండింగ్​ జరిగాయి" -వీఎం రెడ్డి, భారత వాయిసేన అధికారి

యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో.. అత్యవసర సేవలతోపాటు.. సైనిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ రన్‌వేను తీర్చిదిద్దారు. దీని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రన్‌వే నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి 20 రన్‌వేలను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు రన్‌వేలు అందుబాటులోకి వచ్చాయి. కొరిశపాడు వద్ద నిర్మించిన ఈ రన్‌వే అందుబాటులోకి వస్తే... దేశవ్యాప్తంగా మూడోది అవుతుంది. అలాగే.. దక్షిణ భారతదేశంలో ఈ కోవకి చెందిన మొదటి రన్‌వేగా ఘనత సాధించనుంది. ట్రయల్‌రన్‌ సందర్భంగా గుంటూరు, ఒంగోలు నుంచి వచ్చే వాహనాలను కొన్ని గంటల పాటు దారి మళ్లించారు. రన్‌వే ట్రయల్‌రన్‌ విజయవంతం కావడం పట్ల వాయుసేన అధికారులు, బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఆనందం వ్యక్తం చేశారు.

"బాపట్లలో విమానాల అత్యవసర ల్యాండింగ్​కి సంబంధించిన ట్రయల్​ రన్​ పూర్తైంది. దేశంలోనే ఇది మూడోది. ఎయిర్​ఫోర్స్​, నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా, గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా ముగ్గురు కలిసి ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో.. అప్పటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది" -విజయ కృష్ణన్, బాపట్ల జిల్లా కలెక్టర్

బాపట్ల జిల్లాలో విమానాల అత్యవసర ల్యాండింగ్‌ ట్రయల్‌రన్‌ను తిలకించేందుకు.. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మొదటిసారి... తమ ప్రాంతంలో విమానాలు ల్యాండ్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వాయుసేన విమానాలు ఇక్కడ దిగుతాయన్న విషయం తెలిసి వారు హర్షం వెలిబుచ్చారు. విమానాలు చూసేందుకు వచ్చిన ప్రజలతో 16వ నంబరు జాతీయ రహదారి సందడిగా కనిపించింది.

"బాపట్లలో విమానాల అత్యవసర ల్యాండింగ్​ ట్రయల్​ రన్​ పూర్తైంది. ఎయిర్​ఫోర్స్​ ఇచ్చిన ఫీడ్​బ్యాక్​ ప్రకారం రన్​వే కంప్లీట్​గా రెడీగా ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్​ని మళ్లించాము. యూపీ, రాజస్థాన్​ తర్వాత దేశంలోనే మూడో రన్​వే కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది"-వకుల్ జిందాల్, బాపట్ల జిల్లా ఎస్పీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.