ETV Bharat / state

COLLECTOR COUPLE అవును మేం కలెక్టర్లమే.. ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం

COLLECTOR COUPLE: నిత్యం ప్రభుత్వ విధానాలు, రాజకీయ నాయకులతో బిజిబిజీ షెడ్యూల్​తో ఉండే, కలెక్టర్లు ఆటవిడుపుగా ఏదైనా చేస్తే.. అది వార్తే అవుతుంది. ఆలాంటిది కలెక్టర్లుగా ఉన్న భార్యాభర్తలిద్దరూ పొలం బాట పడితే.. అది సామాన్యులకు ఆసక్తిగా ఉంటుంది. అలాంటి ఘటనే బాపట్లలో కనిపించింది. స్వతహాగా కలెక్టర్లు అయిన దినేష్ కుమార్, విజయకృష్ణన్ దంపతులు.. వరినాట్లు వేస్తూ కనిపించారు. ఇంకేముంది.. కెమెరా కళ్లు వారిని బంధించాయి.

COLLECTORS
COLLECTORS
author img

By

Published : Sep 25, 2022, 7:29 PM IST

Updated : Sep 26, 2022, 5:24 PM IST

COLLECTOR COUPLE : జిల్లా కలెక్టర్​ అంటే ఎప్పుడు బిజీబిజీగా ఉంటారని తెలుసు. అధికారులకో చర్చలు, ఎవరైనా పైఅధికారులు వచ్చినప్పుడు వారికి బందోబస్తు, ఏర్పాట్లు ఇలా తీరిక లేకుండా గడుపుతుంటారు. అదే ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లు ఉంటే వారికి మాట్లాడుకోవడానికి క్షణం తీరిక ఉండదు. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే సినిమాలు, షికార్లకు పోయి అలసట తీర్చుకుంటారు. కానీ ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయకృష్ణన్​లు మాత్రం తీరిక దొరికితే.. మహర్షి సినిమాని ఫాలో అవుతారు. అదేనండీ వీకెండ్​ ఫార్మింగ్​. ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వచ్చి కూలీలతో కలిసి నాట్లు వేయడం, వారితో కలిసి భోజనం చేయడం లాంటివి చేస్తారు.

బాపట్ల జిల్లా మురుకొండపాడు సమీపంలోని వ్యవసాయ కూలీలతోపాటు ఈ కలెక్టర్లు వరి నాట్లు వేశారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్టుపై కూర్చుని భోజనం చేశారు. తీరిక సమయాల్లో పొలంలో పని చేస్తూ గట్టుపై కూర్చుని భోజనం చేయటం తమకెంతో ఇష్టమని వారు తెలిపారు.

అవును మేం కలెక్టర్లమే.. ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం

ఇవీ చదవండి:

Last Updated : Sep 26, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.