AP government has released Rs 10 lakh : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోశయ్య కాంస్య విగ్రహ ఏర్పాటుకు రూ.10 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ నుంచి ఈ నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాంస్కృతికశాఖ సంచాలకులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో రోశయ్యకు ఆరు దశాబ్దాల అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి మరణం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళి అర్పించలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆయన స్వగ్రామంలో ఓ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి:
టీడీపీ మహిళా నేతల అరెస్టు.. వైసీపీ పాలనకు పరాకాష్ట: లోకేశ్
టీడీపీ దళిత మహిళ నేతల అరెస్ట్.. జగన్, కొడాలి నానిలను అగౌరపరిచారంటూ...!