- పెద్దపులి దాడిలో ఆవు మృతి.. ఆందోళనలో గ్రామస్థులు
Tiger killed a cow: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు పెద్దపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పులి భయంతో ఆయా గ్రామాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. నాలుగు నెలల క్రితం పశువులపై దాడి చేసిన పులి.. మళ్లీ నిన్న రాత్రి పశువుల పాకపై దాడిచేసి ఆవును చంపింది.ఈ ఘటనతో అన్నమయ్య జిల్లాలోని దొడ్డిపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- గుంటూరులో నకిలీ ఐటీ అధికారి గుట్టురట్టు.. వ్యాపార సంస్థలపై రెక్కి.. ఆ తర్వాత!
FAKE IT OFFICER ARREST IN VIJAYAWADA : వ్యాపార సంస్థలపై రెక్కీ నిర్వహించటం.. ఆపై నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ యజమానిని ఫోన్లో బెదిరించి.. అందినకాడికి దోచుకోవటం.. ఇదీ గుంటూరుకు చెందిన నకిలీ ఐటీ అధికారి తిరుమలరెడ్డి తీరు.
- రైతు భరోసా కేంద్రాలే, రైతు భార కేంద్రాలుగా..!
Farmers struggling: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతు పడరాని పాట్లు పడుతున్నాడు. గతంలో రైతు నుంచి నేరుగా రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసి.... నాలుగైదు రోజుల్లో బకాయిలు చెల్లించేవారు. అయితే... ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆన్లైన్ విధానంలో ఇప్పటికీ బాలారిష్టాలు తొలగడం లేదు. ఏలూరు జిల్లా పెదపాడు, దెందులూరు, పెదవేగి మండలాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఆన్లైన్ పనిచేయకపోవడంతో, ట్రాక్టర్లలో నింపిన ధాన్యంతో రైతులు నిరీక్షించాల్సి వచ్చింది.
- సామాజిక పురోగతి సూచీలో 23వ స్థానంలో ఆంధ్రప్రదేశ్..!
Social Progress Index report: ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన ‘సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్’ నివేదికలో ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరానికి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 707 జిల్లాల సామాజిక పురోగతికి సంబంధించి నివేదికలు వెల్లడించింది. ఏపీకి పక్కనే ఉన్న పుదుచ్చేరి అగ్రస్థానంలో నిలిచింది.
- కంచె దూకి మరీ వ్యాన్‌పై దాడి చేసిన చిరుత
అసోంలోని జోర్హాట్లో ఓ చిరుత హల్చల్ సృష్టించింది. స్థానికంగా వరుస దాడులకు పాల్పడుతూ దాదాపు 15 మందిని గాయపర్చింది. ఇందులో ఇద్దరు అటవీశాఖ సిబ్బందీ ఉన్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇక్కడి రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివాసితులతోపాటు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులపై చిరుత తన పంజా విసిరింది. చిరుత దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆర్ఎఫ్ఆర్ఐ క్యాంపస్ కంచె దూకి ఓ వ్యాన్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
- కన్నతల్లిపై కొడుకు అత్యాచారం.. చంపేస్తానని బెదిరింపులు.. అడ్డొచ్చిన తండ్రిని..
కన్నతల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఆ తర్వాత చంపేస్తానని బెదిరించాడు. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, మాజీ భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు ఓ వ్యక్తి. విషపూరితమైన సిరంజితో పొడిచి పరారయ్యాడు. గుజరాత్లో జరిగిందీ ఘటన.
- నడి సంద్రంలో నరకం.. నెల రోజుల తర్వాత ఒడ్డుకు చేరిన రోహింగ్యా శరణార్థులు
బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లాలనుకున్నా వారికి మార్గమధ్యంలోనే చేదు అనుభవం ఎదురైంది. పడవ ఇంజిన్ ఆగిపోయి ఆహారం, నీళ్లు లేక ఓ చిన్నపాటి పడవపైనే అండమాన్ సముద్రంలో నెలరోజులపాటు కొట్టుమిట్టాడిన ఓ రోహింగ్యా శరణార్థుల బృందం.. చివరకు ఇండోనేసియాకు చేరుకుంది.
- ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. అప్రమత్తంగా ఉండండి లేకుంటే కష్టమే!
ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.
- సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్లేయర్స్‌కు బంపర్ ఆఫర్..
ఆ రాష్ట్ర ప్రభుత్వం యువ క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆసియా గేమ్స్, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి.. డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
- బాలయ్య పవన్ అన్‌స్టాపబుల్ షూటింగ్ షురూ
ఎట్టకేలకు అభిమానుల కల నిజమైంది. ప్రచారంలో ఉన్న నటసింహం బాలకృష్ణ-పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ అగ్రనటులిద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన షూట్ నేడు డిసెంబరు 27న జరగనుంది. ఈ షో కోసం పవన్ స్టైలిష్ లుక్‌లోకి చేంజ్ అయిపోయారు. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలతో పాటు పవన్ లుక్ కూడా నెటింట్టో వైరల్ అవుతోంది.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
TOP NEWS