అన్నమయ్య జిల్లా వీరబల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రణీత్‌కుమార్(9), కార్తీక్(8) సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లారు. బట్టలు ఒడ్డుకు విడిచి నీటిలోకి దిగారు. నీటి ఊబిలో ఇరుక్కుపోయారు. చీకటి పడినా.. పిల్లలు ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు.
చెరువు ఒడ్డుకు బట్టలు కనిపించటంతో నీటిలో గాలించగా.. ప్రణీత్ మృతదేహం లభ్యమైంది. మరో చిన్నారి కార్తీక్ కొనఊపిరితో ఉండటంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. మార్గం మధ్యలోనే కార్తీక్ ప్రాణాలు విడిచారు. ఇద్దరు చిన్నారుల అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి
ACCIDENT ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి, మరో 20 మందికి గాయాలు