ETV Bharat / state

యువగళం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్..!  ఎన్నికల సంఘం సూచన మేరకే: లోకేశ్

TDP National General Secretary Nara Lokesh Padayatra break: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. మార్చి 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిబంధనల దృష్ట్యా.. స్థానికేతరులు జిల్లాలో ఉండకూడదంటూ రెవెన్యూ అధికారులు లోకేశ్​కు నోటీసులు అందజేశారు. దీంతో, ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి తన పాదయాత్రను రెండు రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.

Nara Lokesh Break
Nara Lokesh Break
author img

By

Published : Mar 11, 2023, 8:09 PM IST

Updated : Mar 12, 2023, 6:09 AM IST

TDP National General Secretary Nara Lokesh Padayatra break: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27వ తేదీన 'యువగళం' పేరుతో చిత్తూరు జిల్లాలో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి రాష్ట్ర పోలీసులు లోకేశ్‌ను అడుగడుగునా అడ్డుకున్నారు. పలు రకాల ఆంక్షలను విధించారు. అయినా కూడా ప్రజల మద్దతుతో, పార్టీ కార్యకర్తల అండదండలతో ఆయన 41 రోజులపాటు తన పాదయాత్రను కొనసాగించారు. 41వ రోజు చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేడు తంబళ్లపల్లె నియోజకవర్గంలో ముగిసింది. ఈ క్రమంలో మార్చి 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని.. ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి తన పాదయాత్రను రెండు రోజుల పాటు తాత్కాలికంగా విరామం ఇస్తున్నానని లోకేశ్ ప్రకటించారు.

'యువగళం' పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్: యువగళం పాదయాత్రకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. స్థానికేతరులు ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఉండకూడదంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆయన పాదయాత్రకు విరామం ఇచ్చారు. దీంతో హైదరాబాద్‌‌కు బయలుదేరి వెళ్లిన లోకేశ్.. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం తిరిగి పాదయాత్రలో పాల్గొననున్నారు.

రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేత: మండలి ఎన్నికల నేపథ్యంలో యువగళం పాదయాత్రకు లోకేశ్ రెండు రోజుల తాత్కాలిక విరామం ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు జిల్లాలో ఉండకూడదంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. ఎన్నికల కోడ్‌ ప్రకారం ఓటర్లు కాని స్థానికేతరులు జిల్లాలో ఉండకూడదని తెలిపారు. లోకేశ్‌తో పాటు స్థానికులు కాని సిబ్బంది సైతం వెళ్లిపోవాలని సూచించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు కొంత తర్జనభర్జన పడినా.. చివరకు జిల్లా వీడి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.

ఎన్నికల సంఘాన్ని, చట్టాన్ని గౌరవిస్తున్నా: అంతకుముందు రెవెన్యూ అధికారుల నోటీసులను లోకేశ్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని ముందుగానే నిర్ణయించుకున్నందున.. అన్నమయ్య జిల్లాలోనే ఉండేందుకు అనుమతించాలని కోరారు. 2013లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటి మినహాయింపే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు స్థానికేతరులు ఉండటానికి వీలులేదని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. లోకేశ్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. అక్కడి నుంచి వచ్చిన సమాధానాన్ని తెలియపరుస్తామని చెప్పడంతో.. ఎన్నికల సంఘాన్ని, చట్టాన్ని గౌరవించి జిల్లా విడిచి వెళ్తున్నట్లు లోకేశ్ తెలిపారు.

41వ పాదయాత్ర కొనసాగిందిలా..: నారా లోకేశ్‍ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర 41వ రోజు తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. తట్టివారిపల్లె, అంగళ్లు మీదుగా పాదయాత్ర కొనసాగింది. అంగళ్లులోకి పాదయాత్ర ప్రవేశించగానే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం అంగళ్లులోని యువత, మహిళలు, వృద్దులు లోకేశ్‌ని కలిసి తమ బాధలు వివరించారు. జగన్ పాలనలో అందరూ బాధితులేనని లోకేశ్‍ తెలిపారు. జగన్ పెట్రోల్, డీజిల్‌పై వేస్తున్న అసాధారణ పన్నుల వల్లే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులను తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రేపు, ఎల్లుండి పాదయాత్రకు విరామం: నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి తట్టివారిపల్లె, అంగళ్లు మీదుగా నడిచిన ఆయన.. కంటేవారిపల్లె ఇవాళ్టి యాత్రను ముంగించారు. అక్కడే బస ఏర్పాట్లు చేయగా.. నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాలంటూ లోకేశ్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే.. అన్నమయ్య జిల్లాలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని లోకేశ్‌ కోరారు. 2013లో చంద్రబాబు చేసిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్రకూ తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చారని.. ఈసీకి గుర్తు చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురూచూసిన లోకేశ్ తన పాదయాత్రకు రేపు, ఎల్లుండి పాదయాత్రకు విరామం ప్రకటించారు.

యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం

ఇవీ చదవండి

Last Updated : Mar 12, 2023, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.