Soldier Rajasekhar funerals : జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదానికి గురై రాష్ట్రానికి చెందిన జవాన్ రాజశేఖర్ మృతి చెందారు. ఈరోజు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం రాజశేఖర్ పార్థీవదేహం స్వగ్రామానికి చేరుకోగా.. భార్య ప్రమీల, కుటుంబ సభ్యులందరూ బోరున విలపించారు. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. జవాన్ మృతదేహాన్ని కలెక్టర్ గిరీష, ఎస్పీ విష్ణువర్ధన్ రాజు సందర్శించి నివాళులర్పించారు.
ఇంటి నుంచి పార్థివదేహాన్ని సంబేపల్లి పోలీస్ స్టేషన్ వరకు వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం దేవపట్ల శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి.. సైనికలాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇవీ చదవండి: