Farmers using generators: రాష్ట్రంలో కరెంటు కోతల నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం గున్నికుంట్ల పంచాయతీ కస్పాకు చెందిన రైతు రెడ్డెప్పరెడ్డి 10 ఎకరాల్లో కర్బూజ, దోస, బొప్పాయి పంటలు వేశారు. పంటలన్నీ దిగుబడి ఇచ్చే దశలో ఉన్నాయి. విద్యుత్తు కోతలను దృష్టిలో పెట్టుకొని రూ.లక్షతో జనరేటర్ కొనుగోలు చేశారు.
ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తుతో పాటు మరో 5 గంటలు జనరేటర్‌తో బోరు మోటారు నడుపుతున్నారు. జనరేటర్‌కు గంటకు రూ.300 ఇంధనం ఖర్చవుతోందని రైతు చెబుతున్నారు. ‘పది ఎకరాల పొలాన్ని ఎకరా రూ.30 వేల చొప్పున కౌలుకు తీసుకున్నా... సాగు పెట్టుబడికి రూ.7 లక్షల నుంచి 8లక్షల వరకు వ్యయం చేశా. ఈ సమయంలో పంటను కాపాడుకోవడానికి జనరేటర్ నడపక తప్పడం లేదు’ అని సదరు రైతు తెలిపారు. రోజుకు విద్యుత్తు సరఫరా 3 నుంచి 4 గంటలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
ఇదీ చదవండి:
Power Cuts In Nellore: వేళాపాళా లేని కోతలు.. ఇలాగైతే తడిసేదేలా!