ETV Bharat / state

చంద్రబాబు వేలుకు ఉంగరం... కార్యకర్తల్లో ఆసక్తి.. ఎందుకో వివరించిన అధినేత - తెదేపా వార్తలు

Babu on Ring: సాధారణంగా కనిపించే చంద్రబాబు..తన వేలుకు ఉంగరం ధరించడం కార్యకర్తల్లో ఆసక్తి కలిగించింది. ఇదే అంశాన్ని రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా తెదేపా కార్యకర్తలు అధినేతను ప్రశ్నించారు. దాంతో ఆ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు.

చంద్రబాబు వేలుకి ఉంగరం
చంద్రబాబు వేలుకి ఉంగరం
author img

By

Published : Jul 7, 2022, 4:52 PM IST

చంద్రబాబు వేలుకి ఉంగరం.. అదే దాని ప్రత్యేకత!

Ring on Chandrababu's finger: ఆర్భాటాలకు దూరంగా సాధారణంగా కనిపించే చంద్రబాబు తాజాగా తన వేలుకు ఉంగరంతో కనిపించారు. చంద్రబాబు వేలుకు ఉంగరం ధరించడం కార్యకర్తల్లో ఆసక్తి కలిగించింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో జరిగిన మినీ మహనాడుకు హజరైన చంద్రబాబు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు గమనించి చర్చించుకున్నారు.

ఇదే అంశాన్ని రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా తెదేపా కార్యకర్తలు ప్రస్తావించడంతో.. చంద్రబాబు ఉంగరం ప్రత్యేకతను వివరించారు. ఉంగరంలో కంప్యూటర్‌తో అనుసంధానించిన చిప్ ఉందని తెలిపారు. అది తన హృదయ స్పందనలను, తాను నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందన్నారు. మరుసటి రోజు సమీక్షించుకుని లోపాలు సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.