వైకాపా నాయకుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తను అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. సంక్షేమ పథకాలు పేదలకు అందలేదని.. జనసేన కార్యకర్త మేకల ఈశ్వర్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. దీంతో ఈశ్వర్, అతని మిత్రుడిపై వైకాపా నాయకులు దాడి చేశారు. గాయపడిన ఈశ్వర్ ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కదిరి ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, భైరవ ప్రసాద్, భారతీయ జనతా పార్టీ నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, ఉత్తమ రెడ్డి, గంగాధర్ బాధితుడిని పరామర్శించారు. ఈ అంశంపై డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'మిడతల దండు'యాత్ర!