ETV Bharat / state

రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం - వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు తగ్గిపోయింది

YSRCP Government Careless on Drought Zones: రాష్ట్రంలో దుర్బిక్షం తాండవిస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలోఉన్నా కనీసం కనికరం చూపడం లేదు. 4 వందలకు పైగా మండలాల్లో తీవ్ర దుర్బిక్షం ఉంటే 103 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించి సర్కారు చేతులు దులిపేసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నా ఒక్క మండలాన్నీ కరవు మండలంగా గుర్తించ లేదు.

YSRCP_Government_Careless_on_Drought_zones

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 8:51 AM IST

YSRCP Government Careless on Drought Zones: రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్న మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం

YSRCP Government Careless on Drought Zones : వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటే వానలు (Rains in AP 2023) బాగా కురుస్తాయని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రతీ సీజన్‌లో చెప్తుంటారు. నేనొచ్చాకే ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని ఊదరగొడతారు. వైఎస్సార్సీపీ నాయకులైతే.. కరవు, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కవలలంటూ ఎద్దేవా చేస్తారు. విపత్తుల్ని అడ్డం పెట్టుకుని ఇన్నేళ్లు రాజకీయాలు చేసిన జగన్‌ ముఠా ఇప్పుడు కరవుపై కనీసం నోరెత్తడం లేదు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా కరవు మండలాలను గుర్తించేందుకు ఏ మాత్రం ఇష్టపడ లేదు. ఈ ఏడాది 26 జిల్లాల్లో తీవ్ర దుర్బిక్ష ఛాయలు ఉన్నా అక్టోబరు ఆఖరు వరకు నిద్ర నటించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో 103 మండలాల్లోనే కరవు (103 Drought zones) పరిస్థితులున్నాయని ప్రకటించారు.

Cultivation of Crops has Decreased Due to Lack of Rains : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో (Kharif Crops List) రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సాగు విస్తీర్ణం సాధారణం కంటే 24 లక్షల ఎకరాలు తగ్గింది. ఉద్యాన పంటలనూ కలిపితే 30 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. జూన్, జులైలో వానలు లేక సాగు మందగించింది. వేరుసెనగ సాగు (Groundnut Crop) విస్తీర్ణం 60 శాతం తగ్గింది. విత్తనాలు తెచ్చినా నాటలేకపోయారు. నూనెగింజల పంటల సాగు 48 శాతం, పప్పు ధాన్యాల సాగు 76 శాతానికే పరిమితమైంది. పత్తిసాగు 5 లక్షలకు ఎకరాలకు పైగా తగ్గింది. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తేఒక్క జిల్లాలోనూ 100 శాతం విస్తీర్ణంలో పంటల సాగు లేదు. సత్యసాయి జిల్లాలో 37, చిత్తూరు జిల్లాలో 39, అన్నమయ్య జిల్లాలో 41, పల్నాడు జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 56 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అనకాపల్లి జిల్లాలోనూ 66 శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు.

YSRCP Government Diverted Central Funds: రూ.900కోట్లు కేంద్రం 'కరవు' సాయం.. రైతుల సొమ్ము మాయం చేసిన జగన్‌ ప్రభుత్వం

Drought zones in AP : ఆగస్టులో 361 మండలాల్లో దుర్బిక్షం, 229 మండలాల్లో వర్షపాత లోటు నెలకొంది. వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 184 మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులే. ఎన్టీఆర్‌ జిల్లాలోని 20 మండలాల్లోనూ దుర్బిక్షమే. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 90 శాతానికి పైగా మండలాల్లో వానలు లేవు. అక్టోబరు నెలాఖరు నాటికి 474 మండలాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులే కరవుకు నిదర్శనం. ఐనా ప్రభుత్వానికి కేవలం 103 కరవు మండలాల్లోనే (103 Drought zones in AP) కరవు కనిపించింది.

Extreme Drought Conditions in Andhra Pradesh: రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా.. మొద్దునిద్ర వీడని జగన్ సర్కార్

Rains in AP : 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షం ఈ సంవత్సరం రాష్ట్రంలో నమోదైంది. ఖరీఫ్‌ ఆరంభం నుంచి వర్షాభావం రైతులను వెంటాడింది. ఆగస్టు, అక్టోబరు నెలల్లో కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత తక్కువ వానలు పడ్డాయి. ఆగస్టు నెలలో 55 శాతం తక్కువగా వానలు కురవడమనేది 50 ఏళ్లలో ఎన్నడూ లేదు. 1973 తర్వాత ఇదే మొదటిసారి. అక్టోబరులో 90 శాతం తక్కువ వర్షపాతం కూడా 70 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. పంటలు ఏపుగా ఎదుగుతూ.. కాపు ప్రారంభమయ్యే ఆగస్టు, అక్టోబరు నెలల్లోవానలు లేక రైతులు పెట్టుబడులను పూర్తిగా నష్టపోయారు.

Severe Damage to Groundnut Crop in Anantapur District : జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో వర్షాలు, వరదలు, కరవుతోసుమారు 15వేల కోట్లకు పైగా విలువైన పంటల్ని రైతులు కోల్పోయారు. కోత అనంతర నష్టాలు కలిపితే ఇది ఇంకా పెరుగుతుంది. పెట్టుబడి రాయితీగా 2వేల కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. నష్టపోయిన వారంతా చిన్న, సన్నకారు , కౌలుదారులే. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటకు తీవ్ర నష్టం తలెత్తినా కనీసం సర్కారు పట్టించుకోలేదు. నాలుగేళ్లలో కరవు, విపత్తులతో రైతులకు తీవ్ర నష్టం జరిగినా సీఎం జగన్ మాత్రం తమ పాలనలో అన్నదాతలు సుభిక్షంగా ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.

Groundnut Farmers Removing Crop: కరవుతో 'అనంత' రైతు విలవిల.. ఎండిన పంటను తొలగిస్తూ కన్నీటి పర్యంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.