అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు వార్డుల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. 11వ వార్డుకు చెందిన వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి కుమారుడు 14వ వార్డుకు చెందిన తెదేపా సానుభూతిపరులు పందుల దొంగతనం గురించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుడు రామాంజి తన అనుచరులతో తమ ఇంటిపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో నాగన్న అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గర్భవతి గాయపడగా కళ్యాణదుర్గంలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు పరామర్శించారు. వైకాపా దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇరువర్గాల మధ్య వివాదం... గర్భవతికి గాయాలు - YSP TDP leaders clash in Kalyanadurga municipality
ఇరు వర్గాల నాయకుల మధ్య నెలకొన్న ఘర్షణలో ముగ్గురు గాయపడిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఘటనలో గర్భవతి గాయపడగా ఆమెను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు వార్డుల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. 11వ వార్డుకు చెందిన వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి కుమారుడు 14వ వార్డుకు చెందిన తెదేపా సానుభూతిపరులు పందుల దొంగతనం గురించి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుడు రామాంజి తన అనుచరులతో తమ ఇంటిపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో నాగన్న అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గర్భవతి గాయపడగా కళ్యాణదుర్గంలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు పరామర్శించారు. వైకాపా దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇదీ చూడండి: చిన్నశెట్టిపల్లెలో తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ