ఇంతటి కల్లోల సమయంలోనూ మానవత్వం ఇంకా బతికే ఉందనిపించే సాయాలివే. ముక్కూ మొహం తెలియనివారి అంతిమయాత్రను.. కరోనాకు వెరవకుండా దగ్గరుండి జరిపించడం అన్నది మాటల్లో చెప్పలేని గొప్పతనమే. అనంతపురానికి చెందిన బాలకృష్ణ, లాల్‌బాషా, నిరంజన్... 3 వేర్వేరు స్వచ్ఛంద సంస్థల ద్వారా 2015 నుంచి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లోనూ పేదలకు, వలస కూలీలకు చేయూతనందించారు.
ప్లాస్మా దానంలో చురుగ్గా పాల్గొన్నారు. కరోనా కరాళనృత్యం చేస్తున్న ఈ రెండో దశలో.. వైరస్‌తో మరణించినవారి అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఉన్నవారికి తమవంతు సాయం అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఎవరూ తీసుకెళ్లకుండా ఉన్న కరోనా మృతదేహాలను గుర్తించి.. సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మూడు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒకే స్ఫూర్తితో పనిచేస్తుండటం అందరి మన్ననలను అందుకుంటోంది.
ఇదీ చదవండి: