అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో పవన్ కుమార్(23) సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న యువకుడు.. పొలంలో చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు సంవత్సరాలుగా బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పవన్ కుమార్ లాక్ డౌన్ కారణంగా నెల రోజుల నుంచి స్వగ్రామానికి వచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఓ పక్క కరోనా కాలంలో ఉపాధి కోల్పోవడం.. మరో పక్క ప్రేమించిన అమ్మాయికి వారం క్రితం మరో వ్యక్తితో పెళ్లైయిందని తెలుసుకుని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతుని శవాన్ని పంచనామా కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు.
ఇదీ చదవండి:
ఆబాధ్పేటలో మట్కా గ్యాంగ్ అరెస్ట్.. నగదు, 4 వాహనాలు స్వాధీనం