ETV Bharat / state

Train accident: రైలు ఢీకొని వ్యక్తి మృతి.. ఇంజిన్​లో ఇరుక్కున్న మృతదేహం - ananthapuram district crime

అనంతపురం జిల్లా పెనుకొండ(penukonda) సమీపంలో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మృతదేహం రైలు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. గమనించిన లోకో పైలట్(loco pilot).. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని ఇంజిన్ నుంచి తొలగించారు.

రైలు ఢీ కొని వ్యక్తి మృతి
రైలు ఢీ కొని వ్యక్తి మృతి
author img

By

Published : Oct 18, 2021, 9:20 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో.. వివేక్ ఎక్స్​ప్రెస్(vivek express) రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మృతదేహం రైలు ఇంజిన్(dead body trapped in trains engine) ముందు భాగంలో ఇరుక్కుపోయింది. దీనిని గమనించని లోకో పైలట్.. రైలును సుమారు 20 కిలోమీటర్లు తీసుకువచ్చాడు.

పెనుకొండ మండలంలోని మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మృతదేహాన్ని గుర్తించిన లోకో పైలట్.. రైలును ఆపి స్థానికుల సహాయంతో మృతదేహాన్ని(dead body) ఇంజిన్ నుంచి తొలగించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవపరీక్ష(post martam) నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు(case file) చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ROBBER ARREST: ఎదురింట్లోనే దొంగతనానికి వెళ్లాడు.. కానీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.