రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా... అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో తెదేపా, వైకాపా నాయకులు మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు విరుపాక్షి గౌడ్, ఆయన సోదరుడితో వైకాపా వర్గీయులు ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో వైకాపా వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ తెదేపా నాయకులు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది