అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామ ఎస్సీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయంలో ఆందోళన చేపట్టారు. కాలనీలో ఉన్న బోరు మరమ్మతుకు గురై సంవత్సరమైనా... ఇప్పటి వరకు అధికారులు మరమ్మతు చేయలేదన్నారు.
పొలాల్లోని బోర్ల వద్దకు వెళ్లి రైతులను వేడుకుంటూ రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తెస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సంవత్సరం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. తమ గోడును అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: