వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు(మహిళలు) ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఈ పథకం గడువు సమీపిస్తుండటంతో ఆధార్‌కు మొబైల్ లింక్ కోసం అనంతపురం జిల్లాలోని పలు ఆధార్ సేవా కేంద్రాల వద్ద మహిళలు బారులుదీరారు. గుడిబండ తహసీల్దార్ కార్యాలయంలోని ఆధార్ కేంద్రం వద్ద మహిళలు ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నారు. అధిక సంఖ్యలో రావడంతో కొవిడ్ నిబంధనల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడ సేవలను నిలిపివేశారు. అయితే మహిళలు ఆందోళన చేయడంతో రెవెన్యూ అధికారులు.. పోలీసుల సహకారంతో తిరిగి సేవలు ప్రారంభించారు. సెంటర్ వద్దకు అధిక మంది రావడంతో వైరస్ బారినపడే అవకాశం ఉన్నందున అన్ని మండలాల్లోని ఆధార్ కేంద్రాల్లో ఈ సేవలు కొనసాగించాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి : అనిల్ సింఘాల్