అనంతపురం జిల్లా శింగనమలలో మహిళలు ఆందోళన చేపట్టారు. జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేయాలని నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో వైన్ షాపులను ఓపెన్ చేయటం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమైతే ఊరి చివర్లో మద్యం షాపులు పెట్టుకోవాలని సూచించారు. పలు ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేయాటానికి వస్తున్నారన్నారు. దీంతో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని మార్చాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి