ETV Bharat / state

అంబులెన్స్ లోనే బిడ్డకు జన్మనించిన మహిళ - మహిళకు పురుడుపోసిన ఆంబులెన్స్​ సిబ్బంది తాజా వార్తలు

108 వాహన సిబ్బంది అప్రమత్తతో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు కష్టమని చెప్పటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. అంబులెన్స్​ మెడికల్​ టెక్నిషియన్​ చాకచక్యంగా వ్యవహరించి మహిళకు ప్రసవం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

woman gave birth to the baby
అంబులెన్స్ లోనే బిడ్డకు జన్మనించిన మహిళ
author img

By

Published : Nov 25, 2020, 8:04 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం రేకులకుంట గ్రామానికి చెందిన మహిళ 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు ఆమెను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మహిళను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 వాహనంలో గర్భిణీని పావగడకు తీసుకెళ్తుండగా నొప్పులు ఎక్కువ అయ్యాయి. అయితే మెడికల్​ టెక్నీషియన్​ అప్రమత్తంగా మహిళకు ప్రసవం చేశారు. ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వైద్యులు కష్టమని చెప్పిన ప్రసవాన్ని.. 108 సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సుఖ ప్రసవం చేయటంతో కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి...

ఆడపిల్లలు పుట్టడం.. ఆ ఇల్లాలికి శాపమైంది!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.