అనంతపురంలోని నాయక్ నగర్లో లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
లక్ష్మీదేవి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని.. ఆమెకు బంధువులు ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి