ETV Bharat / state

మద్యం, గంజాయి, సారా దందాలపై.. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈబీ దాడులు - ganja seize in nellore district

రాష్ట్రంలో.. అక్రమంగా మద్యం రవాణా, నాటుసారా.. గంజాయి దందాలపై ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సిబ్బంది విస్తృతంగా దాడులు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని హెచ్చరించారు.

wine, ganja illegal moving in various places at andhrapradhesh
ఆంధ్రప్రదేశ్​లో మద్యం అక్రమ రవాణా
author img

By

Published : Jul 15, 2021, 10:56 PM IST

  • అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో... కర్ణాటక మద్యం తరలిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 30 కార్టన్ల కర్ణాటక మద్యం, ఒక టాటా ఏస్ వాహనం, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
  • విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం కొత్తూరు గ్రామంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు.. సారా తయారీ కేంద్రంపై దాడి చేసి 1250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
  • కడప జిల్లా వేంపల్లెలో అక్రమ మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. ఏడాది కాలంగా.. తనిఖీల్లో పట్టుబడిన 893 మద్యం ప్యాకెట్లను జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ ఈ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
  • నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 78 కిలోల గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

Harassment: మతం మారినందుకు వేధించారు.. వెలేశారు.. చివరికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.