కరోనాను కట్టడి చేసేందుకు అనంతపురంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తప్పవని అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర వెల్లడించారు. కరోనా నియంత్రణలో భాగంగా నగరంలో నిత్యం సోడియం హైపో క్లోరైడ్‌ను పిచికారి చేస్తున్నామని ఆయన చెప్పారు. నగరంలో 150వరకు కాలనీలు ఉన్నాయని వెల్లడించారు. ఇందులో 50కి పైగా మురికి వాడలు ఉన్నాయని... వాటిపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మొత్తం 600మంది పీహెచ్ వర్కర్లు, 400మంది వాటర్ వర్కర్లు నిరంతరాయంగా విధుల్లో ఉన్నారని చెప్పారు. రసాయనాల కొరత లేకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ్యంపై ఎక్కడ ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి నగరంలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూస్తున్నామంటున్నారు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర. ప్రజలు సహకరించకపోతే లాక్‌డౌన్ విజయవంతం కాదని అన్నారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ 15 నుంచి రైలు సేవలు పునరుద్ధరణ!