ETV Bharat / state

హెచ్చెల్సీకి నీరు విడుదల.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - అనంతపురం రైతులపై కథనం

ఎప్పుడూ వివాదాలకు దారి తీసే.. తుంగభద్ర ఎగువ కాలువ హెచ్చెల్సీ నీటి కేటాయింపులపై ఈ సారి అధికారులే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో జరిగే సాగు నీటి సలహా మండలి సమావేశం లేకుండానే నీటి కేటాయింపులు చేశారు. కరోనా కారణంగా ఐఏబి సమావేశం నిర్వహించని అధికారులు.. రైతుల నుంచి ఒత్తిడి రావడంతో నీటిని విడుదల చేశారు. ఎప్పటిలానే తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తూ.. సుమారు లక్ష ఎకరాల సాగు నీరే లక్ష్యంగా పెట్టుకున్నారు. నీటి విడుదలతో రైతులు ఉత్సాహాంగా సాగుకు సన్నద్ధమవుతున్నారు.

water released to hlc cannal
హెచ్చెల్సీకి నీరు విడుదల
author img

By

Published : Sep 5, 2020, 1:44 PM IST

అనంతపురం జిల్లా రైతులు గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా... అని ఎదురు చూస్తున్న తుంగభద్ర ఎగువ కాలువకు సంబంధించి కేటాయింపులు జరిగాయి. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశాయం సకాలంలో నీరు చేరడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. జులై 31న తుంగభద్ర డ్యామ్ వద్ద నీరు విడుదల చేయగా.. ఆగస్టు ఒకటో తేదీ జిల్లా సరిహద్దుకు చేరాయి. ఇప్పటి దాకా జిల్లా సరిహద్దుకు 3.977 టీఎంసీలు చేరాయి.

అయితే అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్న కాలువలకు, జలాశయం ఎంత నీరు కేటాయించాలన్నది సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబి) నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. అనంతపురం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో మూడు జిల్లాలో ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొంటారు. అయితే ఈ సమావేశం ఎప్పుడూ వాడీ వేడిగా సాగేది. కానీ ఈసారి ఐఏబీ సమావేశం లేకుండానే నీటి కేటాయింపులు చేశారు. కరోనా కారణంగా సమావేశం నిర్వహించలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రైతుల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులే నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 24.988 టీఎంసీలు వస్తాయన్న అంచనా మేరకు కేటాయింపులు చేశారు. అయితే ఎప్పటిలానే తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తూ 10 టీఎంసీలు కేటాయించారు. అలాగే సాగు నీటికి 14.988 టీఎంసీలు సాగుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం మీద హెచ్చెల్సీ పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే అన్ని కాలువల కింద వరి నారు పోసుకున్నారు. ప్రధాన కాలువ కిందే ఎక్కువగా ఆయకట్టు సాగుచేస్తారు. హెచ్ఎల్ ఎంసీ, జీబీసీ ఆయకట్టుకు మూడు రోజుల కిందటే నీరు విడుదల చేశారు. నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతుల నుంచి ఒత్తిడి రావడంతో నీటిని వదిలారు.

ఇక ఎమ్పీఆర్, దక్షిణ, ఉత్తర, తాడిపత్రి కాలువలకు అక్టోబరు ఆఖరు లేదా నవంబరు మొదటి వారంలో ఇవ్వాలని ప్రాథమికంగా భావించారు. పీఏబీఆర్ కుడి కాలువకు డిసెంబరులో ఇచ్చే అవకాశం ఉంది. సకాలంలోనే నీటి విడుదల జరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కాలువ సామర్థ్యం మేరకు నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు.

ఈ ఏడాది నీటి లభ్యత చూస్తే అన్ని ప్రాంతాలకు నీరు అందేలానే కనిపిస్తోంది. అయితే మధ్యలో కాలువలకు గండ్లు, ఇతర వృథాల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితులు గతంలో ఉన్నాయి. వీటిపై అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్చెల్సీకి నీరు విడుదల

ఇదీ చదవండి: అది నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు కట్టే ఉరితాళ్లు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.