అనంతపురం జిల్లా మడకశిర మండలం బి.రాయపురం గ్రామంలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల నుంచి నియంత్రిక, బోరు రెండు చెడిపోవడంతో ప్రజలు కిలోమీటర్ దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు గ్రామ పొలిమేర నుంచి నీటిని తీసుకురాలేకపోతున్నారు. చుట్టుపక్క ప్రజలు ఇచ్చే కొద్దిపాటి నీటితో సరిపెట్టుకుంటున్నారు. అధికారులు గ్రామంలోని బోరును మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: పేగు పంచావు.. ప్రాణం పోశావు..!