వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ అనంతపురంలో వక్ఫ్ పరిరక్షణ సమితి ఆందోళన చేపట్టింది. కదిరిలోని సర్వే నంబర్ 400ఏ లోని ఆరు ఎకరాల భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు. ఈ భూమిలో చేపట్టిన రహదారి పనులను అడ్డుకున్నారు.
ప్రధాన రహదారి నుంచి కుమ్మర వాండ్ల పల్లి గ్రామానికి మరో 3 మార్గాల్లో ప్రభుత్వం రహదారి కోసం స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. అధికార పార్టీ నాయకులు రహదారి కోసం మంజూరు చేయించుకున్న నిధులను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పాటు... వక్ఫ్ భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వక్ఫ్ పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు.