అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న గ్రామ వాలంటీర్‌ను అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. తనకల్లు మండలం బాలసముద్రం పంచాయతీకి వైకాపా మద్దతుతో నామినేషన్ వేసిన నిర్మలమ్మ కుమారుడు శివ కుమార్ బాలసముద్రం సచివాలయంలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
శివకుమార్ తల్లి పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్నందున ఓటర్లకు ప్రలోభాలు పెట్టేందుకు కర్ణాటక ప్రాంతం నుంచి బంధువు నాగేంద్రతో కలిసి మద్యం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శివ కుమార్ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేసి192 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీచదవండి: బుధవారం నుంచి నాలుగు జిల్లాలో ఎస్ఈసీ పర్యటన