అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్ వీధిలో నివాసముంటున్న వీఆర్వో నాగ ప్రదీప్ (32) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిబండ మండలం మోర్ బాగుల వీఆర్వోగా నాగ ప్రదీప్ విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా సెలవుపై ఉన్న నాగ ప్రదీప్ ఇంటి వద్దే ఉంటున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇంటిపై గదిలోకి వెళ్లిన నాగ ప్రదీప్ శనివారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఎంతసేపటికీ కిందికి రాకపోవడంతో పైకి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు.
ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పట్టణ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
ఇదీ చదవండి: ఎల్ఎల్సీ కాల్వలో రెండు గుర్తు తెలియని మృతదేహలు