అనంతపురం జిల్లా గుంతకల్లు రాజేంద్రనగర్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పచ్చ కర్పూరం, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పండితులు శుద్ధి చేశారు. అనంతరం శ్రీవారికి నిత్య కైంకర్యాలు సమర్పించారు.
ఈ నెల 16 వ తేదిన జరిగే ఆణివార అస్థాన కార్యక్రమంలో భాగంగా ఈ తంతును జరిపించామని ఆలయ పండితులు తెలిపారు. అలాగే ఆలయంలో అభిషేకాలు, మహా మంగళహారతి, తదితర పూజాదికాలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: