వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరిలో మహర్షి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని కోనేరు కూడలి నుంచి ప్రారంభమైన ఊరేగింపు ప్రధాన వీధుల్లో కొనసాగింది. వాల్మీకి చిత్ర పటాన్ని ప్రత్యేక రథంపై ఉంచి పుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. చిన్నారులు, కళాకారులు చెక్కభజనలు చేస్తూ ఆధ్యాత్మిక పాటలు పాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇదీ చదవండి: మింగ మందుల్లేవు...కానీ సౌందర్యానికి క్రీములు