అనంతపురం జిల్లా గుత్తి కోటలో వెలిసిన హజరత్ సయ్యద్ భాషా వలి 673వ ఉరుసు ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ నెల 5వ తేదీన నిషాన్ జెండా, 6న గంధం, 7న ఉరుసు, 8న జియారత్ కార్యక్రమాలు నిర్వహించనట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. గుత్తి కోట దర్గా నుంచి పట్టణంలోని హజ్రత్ ఖ్వాజా బందే నవాజ్ గ్రేస్ దాస్ దర్గా వరకు గుర్రంపై గంధం, షంషేర్ను పురవీధుల గండా ఊరేగించారు. కొవిడ్ కారణంగా భక్తులు సామాజిక దూరం పాటిస్తూ.. ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: