చింతర్లపల్లి గ్రామంలో.. సర్పంచ్ పదవికి బరిలో ఉన్న తెదేపా సానుభూతిపరాలు గౌరమ్మ ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అభ్యర్థిని భయబ్రాంతులకు గురిచేసి పోటీ నుంచి తప్పించాలని.. అర్థరాత్రి సమయంలో ఈ చర్యకు పాల్పడారు. అంతేకాక పోటీ నుంచి తప్పుకొవాలని.. బెదిరింపులతో ఉత్తరం రాశారని బాధితురాలు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. దానికి సంబంధించిన ఆధారాలను అప్పగించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గౌరమ్మ కుమారుడు చెన్నకేశవులు తెలిపారు.
ఇదీ చదవండీ.. ఇదీ సంగతి: చెన్నైలో రోజు వారీ కూలీ..తొలి స్థానంతో నెల్లూరులో సర్పంచి