ETV Bharat / state

పింఛన్ కోసం పంచాయితీ.. కోడలిని హత్య చేసిన మామ!

కన్న తండ్రిలా కాపాడాల్సిన మామ కర్కశంగా మారిపోయి విచక్షణారహితంగా కోడలి పై రోకలి బండతో దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా పాత గుంతకల్లులో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పింఛన్ విషయంలో కోడలిని హత్య చేసిన మామ
పింఛన్ విషయంలో కోడలిని హత్య చేసిన మామ
author img

By

Published : Nov 1, 2021, 9:17 PM IST

పింఛన్ విషయంలో గొడవ జరిగి.. కోడలిని దారుణంగా హత్య చేశాడో మామ. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ ఘటన జరిగింది. అంకాలమ్మ కాలనీకి చెందిన పరమేష్ కు ఏడేళ్ల క్రితం జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం పరమేష్ క్యాన్సర్ తో మృతిచెందాడు.

అప్పటి నుంచి జ్యోతి.. అత్తమామల వద్దనే ఉంటోంది. మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇవాళ పింఛన్ తీసుకునేందుకు మామ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మామ- కోడలి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మామ మల్లికార్జున.. కోడలిపై రోకలిబండతో దాడి చేసి పరారయ్యాడు.

ఈ దాడిలో జ్యోతి తీవ్రంగా గాయపడింది. రక్తపుమడుగులో పడి ఉన్న జ్యోతిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'వైకాపా గుర్తింపు రద్దు చేయండి'.. ఈసీకి తెదేపా వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.