అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి.. భార్యను వదిలి 14 ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అప్పటినుంచి ఆటో డ్రైవర్గా పని చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. భోజనం చేయడానికి ఇంటికి వచ్చిన అతను.. ఆమెతో గొడవ పడ్డాడు. కాసేపటికి ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడం వల్ల స్థానికులు కిటికీలోంచి చూడగా... ఒకే చీరతో ఇద్దరూ ఉరేసువేసుకోని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణింద్రనాథ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ దొంగతనం!