అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం జలాశయంలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి విహారయాత్రకు వెళ్లి.. భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. సాయికృష్ణ (11) అనే బాలుడు ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట ఆడుకోవడానికి వెళ్లి కాలుజారి పడిపోయాడు. గమనించిన అతని బాబాయ్ హనుమంతు (30).. కాపాడే ప్రయత్నంలో కాలుజారి వరదలో చిక్కుకున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న దగ్గర ఎలాంటి హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
ఇవీ చదవండి: