Two groups attacks each other: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో గడ్డి దొడ్డి స్థలం సరిహద్దు విషయములో ఇరువర్గాల నడుమ గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. పాత కక్షలతోనే ఘర్షణ చోటు చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రెండు వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన వారి మధ్య ఘర్షణ వాతావరణం నేలకొంది. ఇరు వర్గాల గొడవల్లో కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, హనుమంత రెడ్డి, సందీప్ ఆయన భార్య అనసూయ తీవ్ర గాయాల పాలయ్యారు.
మరో వర్గానికి చెందిన శివరాజ్, హనుమంత రాయుడు, భీమయ్య, బసవరాజు, తిప్పేస్వామి, అంజనమ్మలతోపాటు పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. ఘర్షణలో తీవ్ర గాయాల పాలైన బాధితులను అంబులెన్స్‌లో రాయదుర్గం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.
వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేసిన అనంతరం.. అనంతపురం బళ్లారి ప్రధాన వైద్యశాలకు తరలించారు. రాయదుర్గం రూరల్ సీఐ యుగంధర్ గొడవలకు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. పాత కక్షల వల్ల ఒకరికొకరు మారణాయుధాలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: