అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి చెరువు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును తప్పించబోయి... డివైడర్ను ఢీకొని మరో కారును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలియజేశారు. చనిపోయినవారు అనంతపురం నుంచి బెంగళూరు ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్తున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: జల్సాలకు అలవాటు పడి... దొంగతనాలు, అక్రమంగా మద్యం విక్రయాలు!