అనంతపురంలో తిరుపతి లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని తితిదే వారు ప్రారంభించారు. లడ్డూల కోసం ఉదయం నుంచి ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ క్యూ లైన్ లో వేచి ఉండి లడ్డూలను తీసుకెళ్తున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నందున స్వామివారి దర్శనానికి వీలు కాకపోవడంతో ప్రజలకు లడ్డులను అందించాలని నిర్ణయించినట్లు తితిదే వైకుంఠం ఏఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. జిల్లాకు 20 వేల లడ్డూలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం మరిన్ని లడ్డూలు తెప్పించి అందిస్తామని తెలిపారు. ఒక్క లడ్డు 25 రూపాయల చొప్పున విక్రయిస్తున్న ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇది చదవండి పాలబావి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు