అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండల రెవెన్యూ కార్యాలయం ముందు గిరిజన కుటుంబం వినూత్నరీతిలో ధర్నా చేసింది. 15 ఏళ్ల నుంచి తమ ఆధీనంలోని గడ్డి వాము స్థలాన్ని అధికారులు ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తోన్నారంటూ... వర్లి గ్రామానికి చెందిన రాములునాయక్ కుటుంబసభ్యులు వంట సామగ్రితో నిరసన తెలిపారు. వైఎస్సార్ హౌసింగ్ పథకం కింద ఈ స్థలాన్ని... పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. బాధితుల జాబితాలో ఉన్న తమకూ... గడ్డివాము స్థలంలోనే రెండు పట్టాలు ఇప్పించాలని తహసీల్దార్‌ను కోరినా స్పందించలేదని వాపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం'