ETV Bharat / state

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కలకలం... సేవలకు అంతరాయం - kurnool district news

Transfers issue in health department: ఐదేళ్లకు మించి ఒకేచోట పని చేస్తున్న వైద్యులందరూ బదిలీ కావాల్సిందేనంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం రేపుతున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు నిలుపుదల చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Transfers issue in health department
Transfers issue in health department
author img

By

Published : Feb 28, 2022, 2:08 PM IST

Transfers issue in health department: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఐదేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్న వైద్యులందరికీ స్థానచలనం కలిగించాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వైద్య కళాశాల పరిధిలో 278 మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారు 153 మంది ఉన్నారు. ఈ జీవోను వెంటనే నిలిపివేయాలని వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఇతర శాఖల మాదిరిగా వైద్య, ఆరోగ్యశాఖలో ఒకేసారి బదిలీలు చేయడం కుదరదని... దీనివల్ల వైద్యసేవలపై ప్రభావం పడుతుందని సీనియర్ వైద్యులు తెలిపారు.

విద్యార్థులపై ప్రభావం..

కర్నూలు సర్వజన వైద్యశాలలో మెడిసిన్‌, సర్జరీ, గైనిక్‌ విభాగాల్లో 80శాతం మంది ఐదేళ్లు పైబడిన వారు ఉన్నారు. బోధనాసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 90 మంది, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 23 మంది, ప్రొఫెసర్లు 40 మంది ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. వీరందరినీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఇంతమందిని బదిలీ చేస్తే రోగులకు అందే సేవలపై ప్రభావం పడనుంది. మరోవైపు వైద్య విద్యార్థులకు వారి అకాడమిక్ సంవత్సరంపై ప్రభావం చూపిస్తుందంటున్నారు. సాధారణంగా వైద్య, ఆరోగ్యశాఖలోని ఇతర కేడర్‌ ఉద్యోగులకు జోనల్‌ స్థాయిలో, వైద్యులకు రాష్ట్రస్థాయిలో బదిలీలు ఉంటాయి. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడని వైద్యులు బదిలీ అయిన చోట చేరినా దీర్ఘకాలిక సెలవులు పెడుతుంటారు.

ఓపీలను బహిష్కరించిన అనంతపురం వైద్యులు...

వైద్యుల బదిలీ అంశంలో ప్రభుత్వం తమ సూచనలు పరిశీలించాలని అనంతపురంలో వైద్యులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం ఓపిలను బహిష్కరించిన వైద్యులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం జిల్లాలో దాదాపు 150 మంది వైద్యులు ఉంటే 90 మందికి పైగా బదిలీలకు ప్రతిపాదన ఇవ్వడం సరికాదన్నారు. వైద్య కళాశాలలో బదిలీలు చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులను ఇప్పటికిప్పుడు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వైద్యుల సూచనలు పరిశీలించి బదిలీల అంశాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.

వైద్యసేవలు కుంటుపడతాయి..
ఇక్కడివారు అక్కడకు వెళ్లకపోవడం.. అక్కడి వారు ఇక్కడకు రాకపోవడం వల్ల వైద్యసేవలు కుంటుపడతాయని... ప్రభుత్వం పునరాలోచించాలని వైద్యులు కోరుతున్నారు. గతంలో 20 శాతానికి మించి వైద్యులను బదిలీ చేయకూడదన్న నిబంధన ఉండేది. తాజా జీవో ప్రకారం 5 ఏళ్లకు మించి ఒకేచోట పనిచేసినవారిని అందరినీ బదిలీ చేయవచ్చు. ఈ జీవోను రద్దు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

viveka murder case : 'ఆ రాత్రి వివేకా ఇంటికి వెళ్తున్నట్లు సునీల్ చెప్పాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.