అనంతపురం జిల్లాలో గాండ్లపెంట గ్రామ సచివాలయాన్ని శిక్షణ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో పని చేయాల్సిన సిబ్బంది, వాలంటీర్ల సమాచారం అందుబాటులో లేకపోవడంపై గ్రామస్థులను ప్రశ్నించారు. శిక్షణ కలెక్టర్ వచ్చిన విషయాన్ని తెలుసుకుని అక్కడికి సిబ్బంది చేరుకున్నారు. సచివాలయ పోలీస్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అనంతపురంలో నివాసం ఉంటారు. దాదాపు రెండున్నర నెలలుగా ఆమె విధులకు హాజరుకాలేదు. చరవాణి ద్వారా సంప్రదిస్తే రెడ్‌జోన్ ప్రాంతంలో ఉన్నందున రాలేకపోయానంటూ సమాధానం ఇచ్చారు.
తాను... ఉన్నతాధికారి ద్వారా అనుమతి తీసుకున్నాని తెలిపారు. విధులకు హాజరుకాకపోయినా.. ఆమె అన్ని రోజులు కార్యాలయానికి వచ్చినట్టు సిబ్బంది రిజిస్టర్లో సంతకాలున్నాయి. ఆ రిజిస్టర్‌ను పరిశీలించిన శిక్షణ కలెక్టర్ సంబంధిత సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజాధనంతో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించాలని హెచ్చరించారు. విధులకురానిపై ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులను ఎందుకు సమన్వయం చేసుకోలేదని తహసీల్దార్‌ను ప్రశ్నించారు.
ఇదీ చూడండి: