అనంతపురం జిల్లా హిందూపురంలో ట్రాఫిక్ పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని కూరగాయల వ్యాపారులు .. వారితో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై అడ్డంగా వ్యాపారాలు చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు టమోటాలను నేలపాలు చేయడంతో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ కారణంగా ఉన్న కొద్ది సమయంలో కూరగాయలు అమ్ముకుంటుంటే పోలీసులు తమపై ప్రతాపం చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఒకటో పట్టణ సీఐ వారికి సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: కొవిడ్‌పై అవగాహన..కరోనా వేషధారణలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ప్రచారం