అనంతపురం జిల్లా కంబదూరు మండలం నెమలికొండపై వెలసిన తిమ్మప్ప ఆలయంలో ముగ్గురు దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టారు. అయితే ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న కొంతమంది గ్రామస్థులు వినికిడి విని అప్రమత్తమై… దుండగుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతను చెన్నంపల్లి వాసిగా గ్రామస్థులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఆలయం చేరుకున్న పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :