అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బెలుగుప్ప మండలం గుండ్లపల్లి క్రాస్ నుంచి అర్ధరాత్రి మద్యం తాగిన మత్తులో ద్విచక్ర వాహనంలో కదరంపల్లి గ్రామానికి వస్తుండగా... గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో కదరంపల్లి గ్రామానికి చెందిన బోయ సురేష్ (28), చాకలి కృష్ణ (30 ), కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతానికి చెందిన సిద్ధన్న గౌడ్( 32)లు గాయపడ్డారు. క్షతగాత్రులను రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ముగ్గురు మిత్రులు కూడా మృతి చెందారు. రాయదుర్గం ఎస్ ఐ రాఘవేంద్ర ఘటనా స్థలాన్ని చేరుకొని... బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: