అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం రాత్రి పండ్ల వ్యాపారి కార్తీక్ను ప్రకాశ్, హరి, సురేశ్ అనే ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. నాలుగు నెలల క్రితం ప్రకాశ్ వద్ద కార్తీక్ ఏడు వేలకు ఫోన్ కొన్నాడు. ఫోన్ కొన్న సమయంలో నాలుగు వేలు ఇవ్వగా మరో మూడు వేలు ఇవ్వకపోవటంతో ధర్మవరం నుంచి కార్తీక్ను ఎత్తుకెళ్లారు. అతనిని చితకబాదిన దుండగులు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి బెంగళూరులో ఉన్న కార్తీక్ సోదరి నవ్యకు పంపించారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కార్తీక్ ను చంపుతామని బెదిరించారు. ధర్మవరం పోలీసులకు కార్తీక్ సోదరి ఫిర్యాదు చేసింది. డబ్బలు ఇస్తామని ఎరవేసి అనంతపురం నుంచి కిడ్నాపర్లను పోలీసులు ధర్మవరం రప్పించారు. పట్టణ సీఐ కరుణాకర్ పోలీస్ బృందాలతో వెళ్లి కార్తీక్ను విడుదల చేయించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.. కానీ! - latest news dharmavaram
ధర్మవరంలో అపహరణకు గురైన పండ్ల వ్యాపారి కార్తీక్ను పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు. ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో శుక్రవారం రాత్రి పండ్ల వ్యాపారి కార్తీక్ను ప్రకాశ్, హరి, సురేశ్ అనే ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. నాలుగు నెలల క్రితం ప్రకాశ్ వద్ద కార్తీక్ ఏడు వేలకు ఫోన్ కొన్నాడు. ఫోన్ కొన్న సమయంలో నాలుగు వేలు ఇవ్వగా మరో మూడు వేలు ఇవ్వకపోవటంతో ధర్మవరం నుంచి కార్తీక్ను ఎత్తుకెళ్లారు. అతనిని చితకబాదిన దుండగులు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి బెంగళూరులో ఉన్న కార్తీక్ సోదరి నవ్యకు పంపించారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కార్తీక్ ను చంపుతామని బెదిరించారు. ధర్మవరం పోలీసులకు కార్తీక్ సోదరి ఫిర్యాదు చేసింది. డబ్బలు ఇస్తామని ఎరవేసి అనంతపురం నుంచి కిడ్నాపర్లను పోలీసులు ధర్మవరం రప్పించారు. పట్టణ సీఐ కరుణాకర్ పోలీస్ బృందాలతో వెళ్లి కార్తీక్ను విడుదల చేయించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెన్సిల్ మొనపై అందమైన ఆకృతులు