ETV Bharat / state

అనంత రైతులకు శుభవార్త..మూడు ప్రాసెసింగ్​ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు

అనంతపురం జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులకు ధరలేక నష్టపోతున్న రైతులకు ఊరట కలిగించేలా అనంత జిల్లాకు రక్షణశాఖ అనుబంధ సంస్థ ఫుడ్ రీసర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు సాయం చేయటానికి ముందుకు వచ్చారు. జిల్లాలో అధికంగా పండుతున్న టమాటా, బత్తాయి, వేరుసెనగ ఉత్పత్తులపై పరిశోధనలు నిర్వహించిన డీఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తల బృందం.. జిల్లాలో పర్యటించి అధికారులకు హామీ ఇచ్చింది. ఇప్పటికే అనేక ఉత్పత్తులపై పరిశోధనలు నిర్వహించిన ఆ సంస్థ అనంతపురం జిల్లాలో ఉత్పత్తి చేసే పంటలు అత్యంత నాణ్యతగా ఉంటాయని, వీటికి నిల్వకాలం ఎక్కువని కూడా నిర్ధారించింది.

ananthapur district
ananthapur district
author img

By

Published : Sep 2, 2021, 10:10 PM IST

అనంతపురం జిల్లా పేరు చెప్పగానే తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు గుర్తొస్తాయి. కాని అక్కడి ఉద్యాన పంటల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా 2.05 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. దీనిలో టమాటా 16 వేల హెక్టార్ల మేర సాగవుతుండగా, బత్తాయి 55 వేలు, వేరుశెనగ 4.60 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ఉద్యాన పంటల హబ్​గా పేరున్న అనంతపురం జిల్లాలో పలు పంటలకు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు.

జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన ప్రస్తుత ఎంపీ తలారి రంగయ్య ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుపై గత కొంతకాలంగా ప్రయత్నాలు ఆరంభించారు. కిసాన్ రైలు జిల్లాకు తీసుకురావటానికి కృషిచేసిన ఎంపీ, ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొచ్చే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నెలల క్రితం రక్షణశాఖ ఆహార పరిశోధన ప్రయోగశాల శాస్త్రవేత్తల బృందాన్ని జిల్లాకు పిలిపించి సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్తలు జిల్లా నుంచి పలు ఉత్పత్తులను బెంగళూరు తీసుకెళ్లి పరిశోధనలు నిర్వహించారు. బత్తాయి, టమాటా, వేరుశెనగ పంటల ద్వారా విలువ జోడించిన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తేల్చారు.

తాజాగా డీఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తల బృందం మూడు రోజులు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. జిల్లాలో పండించే టమాటాలు.. ఉప ఉత్పత్తులు తయారు చేయటానికి అనువైన రకాలు కాదని, వీటిలో గింజలు ఎక్కువగా, గుజ్జు తక్కువగా ఉంటుందని రైతులు, అధికారులు భావిస్తుండేవారు. కాని స్థానిక రకం టమాటాతో కూడా అనేక ఉత్పత్తులు చేయవచ్చని శాస్త్రవేత్తల బృందానికి సారథ్యం వహిస్తున్న డా. ఆనంద్ స్పష్టం చేశారు. అనంత టమోటాతో పచ్చడి, ప్యూరీ, సాస్ వంటి ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చని చెప్పారు. అదే విధంగా బత్తాయి తాజా జ్యూస్ తాగటానికి తప్ప ఉప ఉత్పత్తులకు పనికిరాదని ఇప్పటి వరకు అందరిలో భావన ఉండేది. అయితే అనంత బత్తాయి ద్వారా నిలవ ఉండే రసం తయారు చేయవచ్చని పరిశోధనల్లో తేలింది. వేరుశెనగను బర్ఫీ చేయటం వరకే అందరికీ తెలుసు. అయితే డీఎఫ్ఆర్ఎల్​లో నిర్వహించిన పరిశోధనలతో పీనట్ బటర్ తయారు చేయవచ్చని తేల్చారు.

మొత్తం మీద ఈ మూడు పంటలను.. ఫుడ్ ప్రాసెసింగ్ చేయవచ్చని నిర్ధారించిన డీఎఫ్ఆర్ఎల్ శాస్త్రవేత్తలు వీటి పరిశ్రమల స్థాపనకు అవసరమైన శాస్త్ర పరిజ్ఞానం ఇవ్వటంతోపాటు, సాంకేతిక యంత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం తొలిదశలో జేఎన్టీయూలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెంటర్ ఏర్పాటుకు నాబార్డ్ నుంచి ఆర్థిక సహకారం ఉంటుందని.. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పథకం అమలు చేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు సమావేశంలో స్పష్టం చేశారు. జేఎన్టీయూ ప్రాంగణంలో త్వరలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు, శాస్త్రవేత్తలు ఆగస్టు 31న కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక కార్యరూపంలోకి వస్తే అనంతపురం జిల్లాలో ఈ మూడు పంటలు సాగుచేసే రైతుల కష్టాలు కొంత వరకు తీరినట్లే..

ఇదీ చదవండి:

fire accident near jntu: జేఎన్‌టీయూ సమీపంలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.