డీఆర్డీఓ అనుబంధ సంస్థ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబరేటరీస్కు చెందిన ఆహార శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో అనంతపురంలో సమావేశమయ్యారు. డాక్టర్ ఓఆర్ దేవన్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రుద్ర గౌడలు అనంతపురం పార్లమెంటు సభ్యులు రంగయ్య ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో డ్రామా సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మూడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు ఎంపీ రంగయ్య చెప్పారు. జిల్లాలో ఎక్కువగా లభించే టమాటా, వేరుశనగ, బత్తాయి సంబంధిత ఆహార పదార్థాల తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఆర్డీఓ సంస్థ ఆధ్వర్యంలో ఒకటి, నాబార్డు సహకారంతో మరొకటి, సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ రంగయ్య తెలిపారు.
ఇదీ చదవండి :